kcr: కాళేశ్వరం పనుల పరిశీలనకు బయల్దేరిన కేసీఆర్

  • బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరిన కేసీఆర్
  • వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ
  • సాయంత్రం 4.30కు ముగియనున్న పర్యటన

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బయల్దేరారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, టీఎస్ ఎండీసీ ఛైర్మన్ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలు ఉన్నారు. ఈ సందర్భంగా తొలుత మేడిగడ్డ ఆనకట్ట, కన్నేపల్లి పంపు హౌస్ లను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, సంపు హౌస్ లను పరిశీలిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కేసీఆర్ పర్యటన ముగుస్తుంది. అనంతరం కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని తన నివాసంలో కేసీఆర్ బసచేయనున్నారు.

  • Loading...

More Telugu News