kim jong un: నూతన సంవత్సర ప్రసంగంలో.. అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన కిమ్ జాంగ్

  • ఆంక్షలను ఎత్తివేయకపోతే మరోదారి చూసుకుంటాం
  • ట్రంప్ తో చర్చలు జరిపేందుకు నేను సిద్ధం
  • అమెరికాతో కలసి మిలిటరీ డ్రిల్స్ ను దక్షిణకొరియా ఆపేయాలి

అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన ప్రసంగిస్తూ... తమపై ఆంక్షలను కొనసాగిస్తే, తాము మరో దారి చూసుకోక తప్పదని అమెరికాను హెచ్చరించారు. అంతర్జాతీయ సమాజం ముందు తమకు ఇచ్చిన హామీని అమెరికా నిలబెట్టుకోవాలని కోరారు. లేని పక్షంలో... తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటానికి తాము మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

అమెరికా సరైన రీతిలో స్పందిస్తే... డీన్యూక్లియరైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా కొనసాగుతుందని కిమ్ తెలిపారు. ప్రపంచానికి మేలు కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చలు జరిపేందుకు తాను ఏ క్షణమైనా సిద్ధమేనని చెప్పారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా తమపై ఒత్తిడిని కలిగించవద్దని తెలిపారు. అమెరికాతో కలసి సంయుక్త మిలటరీ డ్రిల్స్ ను నిర్వహించవద్దని ఈ సందర్భంగా దక్షిణకొరియాను కిమ్ కోరారు. కొరియా ద్వీపకల్పంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఉత్తర, దక్షిణ కొరియాలు పలు కోణాల్లో చర్చలు జరపాలని అన్నారు. 

More Telugu News