Kumbh mela: ప్రజలకు సేవ చేయాలన్న మీ తపన ఆదర్శనీయం: చంద్రబాబును ప్రశంసించిన యూపీ మంత్రి

  • కుంభమేళాకు ఆహ్వానించిన యూపీ మంత్రి
  • చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ప్రశంస
  • యోగి తరపున ఆహ్వాన పత్రిక అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఉత్తరప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి సతీశ్ మహానా ప్రశంసల వర్షం కురిపించారు. యూపీలోని ప్రయాగలో ఈ నెల 15 నుంచి జరగనున్న కుంభమేళాకు ఆహ్వానించేందుకు వచ్చిన ఆయన ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలుసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరపున కుంభమేళా ఆహ్వాన పత్రికను అందించి ఆహ్వానించారు. అలాగే, వారణాసిలో ఈ నెల 21 నుంచి మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన ‘ప్రవాస భారతి’ దినోత్సవానికి కూడా హాజరు కావాలని కోరారు.

ఈ సందర్భంగా సతీశ్ మహానా మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాలలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనలో నిత్యం కనిపిస్తుందని అన్నారు. ప్రజలకు మంచి చేయడానికి తపిస్తున్న ఆయన కృషి ఆదర్శనీయమన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కష్టించినట్టుగానే తాను కూడా యూపీలో కష్టపడుతున్నానని, ఈ విషయంలో ఆయనే తనకు స్ఫూర్తి అని మంత్రి పేర్కొన్నారు.
Kumbh mela
Uttar Pradesh
Chandrababu
Andhra Pradesh

More Telugu News