Telugudesam: టీడీపీలో చేరిన సినీనటి దివ్యవాణి

  • సీఎం చంద్రబాబును కలిసిన దివ్యవాణి
  • టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బాబు
  • టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త
సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రముఖ సినీ నటి దివ్యవాణి టీడీపీలో చేరారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబును ఆమె కలిశారు. దివ్యవాణికి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కోసం పాటుపడతానని, పార్టీ గెలుపు కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. కాగా, కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త దేవీప్రసాద్ కూడా టీడీపీలో చేరారు. ఐటీ అధికారిగా చేసి ఆయన పదవీ విరమణ పొందారు. 
Telugudesam
Tollywood
divyavani
Chandrababu

More Telugu News