Whatsapp: నూతన సంవత్సరంలో కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవల నిలిపివేత

  • కొన్ని ఫోన్లలో ఇప్పటికే వాట్సాప్ నిలిపివేత
  • నోకియా ఎస్ 40లో నేటి వరకే వాట్సాప్
  • మరికొన్ని ఫోన్లలో ఫిబ్రవరి డెడ్‌లైన్
నూతన సంవత్సరంలో కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. పాత వర్షన్‌కు సంబంధించిన ఓఎస్‌లలో వాట్సాప్‌ను నిలిపివేస్తున్నట్టు వాట్సాప్ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే బ్లాక్‌బెర్రీ 10, బ్లాక్‌బెర్రీ ఓఎస్, నోకియా ఎస్ 60, విండోస్ 8.0లలో తమ సేవలను వాట్సాప్ నిలిపివేసింది. ఇక నోకియా ఎస్ 40 వర్షన్‌లో అయితే 2019 జనవరి 1 నుంచి, ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.7, అంతకంటే పాత ఆండ్రాయిడ్ వర్షన్లు, ఐఫోన్ ఐఓస్ 7 తదితర పాత ఓఎస్‌లలో 2020 ఫిబ్రవరి చివరి నాటికి వాట్సాప్‌ను నిలిపివేస్తున్నట్టు సంస్థ స్పష్టం చేసింది.
Whatsapp
Nokia
Androd version
I Phone

More Telugu News