Maharshi: ‘మహర్షి’ సెకండ్ లుక్ విడుదల.. మహేశ్ లుక్ పై ప్రశంసలు!

  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’
  • సూటూబూట్, కళ్లజోడు ధరించిన మహేశ్
  • ఎంతో స్టైల్ గా మహేశ్ లుక్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం మహర్షి. ఈ చిత్రం సెకండ్ లుక్ ను చిత్రయూనిట్ ఈరోజు సాయంత్రం విడుదల చేసింది. సూటూబూట్, కళ్లజోడు ధరించిన మహేశ్, అతని గ్యాంగ్ నడుచుకుంటూ వస్తుండటం ఈ సెకండ్ లుక్ లో కనపడుతుంది.

 ఈ లుక్ లో ఎంతో స్టైల్ గా మహేశ్ కనబడుతుండటంతో అభిమానులు ‘సూపర్బ్’ అంటూ స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా  వంశీ పైడిపల్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ చిత్రంలో రుషి పాత్రలో మహేష్ నటిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. 

More Telugu News