west benga: పశ్చిమ బెంగాల్ లో రైతుబంధు, పంట బీమా తరహా పథకాలు.. సీఎం మమతాబెనర్జీ ప్రకటన

  • పంట పెట్టుబడి సాయం కింద రూ.5 వేలు
  • రైతు చనిపోతే రూ.2 లక్షల నష్టపరిహారం
  • పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ప్రకటించాయి. తాజాగా, పశ్చిమబెంగాల్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ లో రైతుబంధు, రైతుబీమా తరహా పథకాలు అమలు కానున్నాయి. ఈ విషయాన్ని సీఎం మమతాబెనర్జీ పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి కింద ఏటా ఎకరానికి రూ.5 వేల ఆర్థికసాయంను అందజేస్తామని చెప్పారు. 18-60 మధ్య వయసు గల రైతులు మృతి చెందితే బాధిత రైతు కుటుంబానికి రూ.2 లక్షలు నష్టపరిహారం అందజేస్తామని, పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని  మమతాబెనర్జీ ప్రకటించారు.

More Telugu News