varalakshmi sarathkumar: నేను ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతానని కొంతమంది కలలు కంటున్నారు: వరలక్ష్మీ శరత్ కుమార్

  • కావాలని ప్రచారాలు చేస్తున్నారు
  • నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను 
  • నన్ను ఎవరూ తొక్కెయ్యలేరు

విశాల్ .. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో పడ్డారనీ, పెళ్లి చేసుకునే అవకాశాలు వున్నాయనే వార్తలు చాలా కాలం నుంచి కోలీవుడ్లో షికారు చేస్తున్నాయి. విశాల్ తన స్నేహితుడు మాత్రమేననీ, తమ మధ్య మరెలాంటి బంధం లేదని వరలక్ష్మి శరత్ కుమార్ చాలా సందర్భాల్లో చెప్పింది. విశాల్ కూడా ఇదే మాట చెబుతూ వచ్చాడు. అయినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు.

విశాల్ తో వరలక్ష్మి పెళ్లి అంటూ మళ్లీ వార్తలు షికారు చేస్తుండటం పట్ల ఆమె తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. కొంతమంది పనికిమాలినవాళ్లు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. "నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను .. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతానని కొంతమంది కలలు కంటున్నారు. నేను ఎక్కడికీ వెళ్లను .. ఇక్కడే వుంటాను .. సినిమాలు చేస్తూనే వుంటాను. నేను ఎవరిని ఉద్దేశించి ఈ స్టేట్మెంట్ ఇచ్చానన్నది .. అవతలివారికి అర్థమయ్యే ఉంటుంది. ఎన్ని నాటకాలు ఆడినా నన్ను తొక్కెయ్యలేరు " అని ఆమె స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News