sensex: సంవత్సరాంతంలో ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • మెరిసిన మెటల్ స్టాకులు
  • బలహీనంగా ట్రేడ్ అయిన ఎనర్జీ, ఇన్ఫ్రా, రియాల్టీ స్టాకులు
  • సెన్సెక్స్ 8 పాయింట్స్ డౌన్.. నిఫ్టీ 3 పాయింట్స్ అప్

2018 సంవత్సరం చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. మెటల్ స్టాకుల అండతో ప్రారంభంలో జోరుగా కొనసాగిన మార్కెట్లు... బలహీనంగా ట్రేడ్ అయిన ఎనర్జీ, ఇన్ఫ్రా, రియాల్టీ స్టాకుల ప్రభావంతో లాభాలను కోల్పోయాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు కోల్పోయి 36,068కు చేరింది. నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 10,863కు పెరిగింది.  

టాటా స్టీల్, వేదాంత, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితర సంస్థలు లాభాల్లో ముగిశాయి. హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా తదితర సంస్థలు నష్టపోయాయి.

More Telugu News