చంద్రబాబు ఓ గజదొంగ.. ఇప్పుడు ఆయన కన్ను దేశంపై పడింది!: కన్నా లక్ష్మీనారాయణ
- ఏపీని దొంగలతో కలిసి దోచుకున్నారు
- కాంగ్రెస్ పార్టీతోనూ చేతులు కలిపారు
- అన్నింటినీ మోదీకి అంటించడం సరికాదు
ఎక్కడ ఏం జరిగినా దాన్ని చంద్రబాబు ప్రధాని మోదీకి ముడిపెడుతున్నారని కన్నా మండిపడ్డారు. ఇది అసలు మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు, నిర్మాణాలు పూర్తికాకుండానే హైకోర్టును తెచ్చుకున్నారని దుయ్యబట్టారు.