Chandrababu: ఆసుపత్రిలో పైసా ఖర్చులేకుండా ప్రసవం.. ఏపీ ప్రభుత్వం మహిళలకు కొత్త సంవత్సర కానుక

  • నిరుపేద మహిళల కోసం ‘తల్లి సురక్ష’ పథకం
  • సహజ, సిజేరియన్‌ ఏదైనా ఖర్చు భరించేది సర్కారే
  • స్త్రీశిశు మరణాల అదుపు లక్ష్యం

స్త్రీశిశు మరణాల అదుపు, దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకు సురక్షిత ప్రసవం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ‘తల్లి సురక్ష’ పథకాన్ని ప్రారంభించింది. ప్రసవ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన నిరుపేద మహిళలు పైసా ఖర్చులేకుండా కాన్పు చేయించుకుని బయటకు రావచ్చు.

ఇందుకు సంబంధించి నగదు రహిత సురక్షిత కాన్పు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా వైద్య ఆరోగ్య శాఖ ఆవిష్కరించింది. ఈ పథకం ద్వారా ఏటా ఐదు లక్షల మంది గర్భిణులు ప్రయోజనం పొందనున్నారు. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2017-18లో ఆసుపత్రుల్లో సురక్షిత కాన్పుల సంఖ్య దాదాపు 6 లక్షల 96 వేలు ఉండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3 లక్షల 23 వేల కాన్పులు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం వల్ల  ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు పొందుతున్న మిగిలిన వారు కూడా ప్రయోజనం పొందవచ్చు. ప్రసవ మరణాల సంఖ్య ప్రస్తుతం లక్షకు 65గా ఉండగా, వీటిని 55కు తగ్గించడం లక్ష్యమని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News