ajit: మాస్ కాదు.. ఊరమాస్.. అజిత్ ‘విశ్వాసం’ ట్రైలర్ విడుదల!

  • అజిత్ కు జోడీగా నయనతార
  • పల్లె నేపథ్యంలో సాగనున్న స్టోరీ
  • సంక్రాంతికి సినిమా విడుదల 

అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘విశ్వాసం’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమాలో అజిత్ కు జోడీగా నయనతార, ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. అజిత్ తో వీరం, వేదాలం, వివేగం సినిమాలను తెరకెక్కించిన  శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పక్కా యాక్షన్ తో అదరగొట్టేశాడు.

తమిళనాడులోని ఓ పల్లె నేపథ్యంలో సినిమా సాగనుంది.సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఇమాన్ సంగీతం అందించారు. విశ్వాసం సినిమాలో సత్యరాజ్‌, ప్రభు గణేశన్‌, సంపత్‌రాజ్‌, యోగిబాబు, వివేక్  తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ హైవోల్టేజీ యాక్షన్ ట్రైలర్ ను మీరూ చూసేయండి.

More Telugu News