kcr: నేనేదో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నానట? అప్పుడు నువ్వెక్కడున్నావు కేసీఆర్?: సీఎం చంద్రబాబు

  • అప్పుడు, మీరు నాతోనే ఉన్నారు కదా?
  • ఏం మాట్లాడుతున్నారు? 
  • ఆ తర్వాతే కదా మీరు మంత్రి అయ్యారు?
ఎన్టీఆర్ దగ్గర నుంచి టీడీపీని తాను లాక్కున్నానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేనేదో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నానట! అప్పుడు నువ్వెక్కడున్నావు? నాతోనే ఉన్నారు కదా? ఏం మాట్లాడుతున్నారు? ఆ తర్వాతే కదా మీరు మంత్రి అయ్యారు? వైస్రాయ్ హోటల్ సిద్ధాంత కర్త ఆయనే కదా. నడిపించిందే ఆయన, ఆ విషయాలు ఆయనకు తెలియదా?’ అని ప్రశ్నించారు.
 
‘హరికృష్ణ చనిపోయినప్పుడూ అంతే. ఆసుపత్రి, పోస్టుమార్టమ్, బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయమని కోరాం. అందులో తప్పేముంది?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుని, ముందుకుపోదామని తాను కోరానని, దాన్ని వదిలిపెట్టి, కనీసం ఒక్కరోజు కూడా కేసీఆర్ సహకరించలేదని, ఏపీకి కేంద్రం కూడా సహకరించట్లేదని బాబు విమర్శలు గుప్పించారు. 
kcr
Chandrababu
TRS
Telugudesam
Andhra Pradesh
Telangana
ntr
nandamuri
hari krishna

More Telugu News