Telangana: ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రధాని కావొచ్చు!: ఎంపీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

  • కేటీఆర్ సీఎం కావడానికి సమయముంది
  • ఈ విషయాన్ని అన్నే గతంలో చెప్పాడు
  • మీడియా ఇంటర్వ్యూలో కవిత వెల్లడి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కేసీఆర్ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ మేరకు స్పందించారు.

 ఈ సందర్భంగా ‘ఫెడరల్ ఫ్రంట్ మెజారిటీ సీట్లతో అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రధాని అవుతారా?’ అని యాంకర్ ప్రశ్నించారు. దీంతో కవిత స్పందిస్తూ.. ‘అప్పటి పరిస్థితి, సందర్భాన్ని బట్టి ఎవరు ప్రధానిగా ఉండాలో నిర్ణయించుకుంటాం. ప్రధాని అయ్యేవాళ్లలో కేసీఆర్ కూడా ఉండొచ్చు. ఆయన కూడా ప్రధాని కావొచ్చు’ అని తెలిపారు.

మరోవైపు సోదరుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘ఇంకా దానికి టైమ్ ఉంది కదండీ. అప్పుడే తొందరేమీ లేదు. ఈ విషయాన్ని మా అన్నగారే చాలాసార్లు చెప్పారు’ అంటూ తప్పించుకున్నారు.

More Telugu News