Maharashtra: హోటళ్లు, బార్లు, పబ్‌లకు ‘మహా’ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మందుబాబులు ఫుల్ ఖుష్

  • 31న రాత్రంతా తెరిచిపెట్టుకోవచ్చు
  • అనుమతులు ఇచ్చిన ఫడ్నవిస్ ప్రభుత్వం
  • 40 వేల మంది పోలీసుల మోహరింపు
మహారాష్ట్ర ప్రభుత్వం పబ్‌లు, బార్లు, హోటళ్లకు శుభవార్త అందించింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో 31న రాత్రంతా బార్లు, హోటళ్లు, పబ్‌లు తెరిచి ఉంచేందుకు అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో కొత్త సంవత్సరాన్ని ‘మత్తు’గా ఆహ్వానించే మందుబాబులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరోవైపు హోటళ్లు, బార్లు, పబ్‌ల యాజమాన్యాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

బార్లకు అనుమతులు ఇచ్చిన ఫడ్నవిస్ ప్రభుత్వం కొత్త సంవత్సరం రోజున ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా నగరవ్యాప్తంగా 40 వేల మంది పోలీసులను మోహరించనుంది. వేడుకల సందర్భంగా మహిళలపై వేధింపుల నివారణకు పోలీసులు సివిల్ డ్రెస్‌లలో కాపలా కాస్తుంటారని ముంబై డీసీపీ పీఆర్ఓ మంజునాథ్ సింగే తెలిపారు.
Maharashtra
Mumbai
Pubs
Bars
Hotels
Devendra Fadnavis

More Telugu News