Hyderabad: హైదరాబాద్, మోతీనగర్ లో బీభత్సం సృష్టించిన లారీ!

  • మోటార్ సైకిల్ ను ఢీకొన్న లారీ
  • యువకుడి మృతి
  • ధ్వంసమైన పలు వాహనాలు
హైదరాబాద్ పరిధిలోని బోరబండ, మోతీనగర్‌ లో శనివారం అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ఆ లారీ, తొలుత రోడ్డుపై వెళుతున్న మోటార్ సైకిల్‌ ను, ఆపై పక్కన పార్కింగ్ చేసిన మరికొన్ని వాహనాలను ఢీకొంది.

 ఈ ఘటనలో మోటార్ సైటిల్ పై ప్రయాణిస్తున్న రుష్యేందర్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, లారీ డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని రుష్యేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పేర్కొన్నారు. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
Hyderabad
Borabanda
Moti Nagar
Lorry
Road Accident

More Telugu News