Mahesh Babu: మహేశ్ బాబు బాకీ వసూలైంది.. ఖజానాకు జమ చేశాం!: జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు

  • మహేశ్ అప్పీళ్లను రెండు అథారిటీలు తిరస్కరించాయి 
  • హైకోర్టుకు వెళ్లినా స్టే ఇవ్వలేదు 
  • నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్న అధికారులు

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని వసూలు చేశామని జీఎస్టీ కమిషనరేట్ పేర్కొంది. మహేశ్ బాబు మొత్తం రూ. 73 లక్షలు కట్టాల్సివుండగా, గురువారం నాడు రూ. 42 లక్షలను రికవరీ చేశామని, తాజాగా, ఆయన ఖాతాల్లో నుంచి రూ. 31.47 లక్షలను ప్రభుత్వ ఖజానాకు జమ చేశామని, దీన్ని డీడీ రూపంలో ట్రెజరీ బ్యాంకుకు జమ చేశామని జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసులో మహేశ్ బాబు చేసుకున్న అప్పీళ్లను రెండు అథారిటీలు తిరస్కరించాయని గుర్తు చేసిన అధికారులు, సెప్టెంబర్ లో ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ స్టే ఇవ్వలేదని, వీటిని దృష్టిలో పెట్టుకునే తాము చర్యలకు దిగామని అధికారులు స్పష్టం చేశారు. 2010లోనే తాము ఆయనకు నోటీసులు ఇచ్చినా, స్పందించని కారణంగానే ఖాతాలను సీజ్ చేసి, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు చేసినట్టు పేర్కొన్నారు.

More Telugu News