Manipur: ఉద్యోగోన్నతిని డిమాండ్ చేస్తూ.. నిత్యం రక్తదానం చేస్తున్న వైద్యులు!

  • రోజుకు మూడు యూనిట్ల రక్తదానం
  • డిమాండ్లను పరిష్కరించే వరకూ నిరసన
  • ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు

తమ డిమాండ్ల సాధన కోసం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌ (జేఎన్‌ఐఎంఎస్‌)కు చెందిన వైద్యులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగోన్నతి కల్పించాలని కోరుతూ, నిత్యం మూడు యూనిట్ల రక్తాన్ని జేఎన్ఐఎంఎస్ బ్లడ్ బ్యాంకుకు పంపిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో 50 మంది డాక్టర్లు పాల్గొన్నారు.

ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ దాన్ని అలాగే కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు. తమ డిమాండ్లతో కూడిన లేఖను ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖా మంత్రికి పంపించామని.. కానీ తమకు సానుకూల స్పందన రాలేదని వైద్యులు స్పష్టం చేశారు. తమ భవిష్యత్తుకే భద్రత లేనప్పుడు, విధులు సక్రమంగా ఎలా నిర్వర్తించగలమని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ బ్లడ్ బ్యాంకుకు రక్తదానం చేస్తూనే ఉంటామని వెల్లడించారు.

More Telugu News