nani: జనవరి 1న 'జెర్సీ' నుంచి ఫస్టులుక్

  • నాని కథానాయకుడిగా 'జెర్సీ'
  • కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్ 

నాని కథానాయకుడిగా 'జెర్సీ' సినిమా రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తాడు. మధ్య వయసున్న లుక్ లోను ఆయన కనిపించనున్నాడు. క్రికెటర్ పాత్రలో సహజత్వం కోసం నాని కొన్ని రోజుల పాటు క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాలో నాని పోషిస్తోన్న పాత్ర పేరు అర్జున్.

జనవరి 1వ తేదీన అర్జున్ పాత్ర .. అందరినీ కలవనున్నట్టుగా ఒక పోస్టర్ బయటికి వచ్చింది. అంటే ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రానున్నట్టుగా తెలుస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, నాని సరసన కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే నాని, ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 

More Telugu News