banks: 10 లక్షల కోట్లను దాటిన మొండి బకాయిలు.. మరింత దిగజారిన బ్యాంకుల పరిస్థితి

  • మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు రూ. 10.59 లక్షల కోట్లు
  • 9.3 శాతం నుంచి 11.2 శాతానికి పెరిగిన మొండి బకాయిలు
  • ప్రభుత్వ బ్యాంకుల వాటా రూ. 8.95 లక్షల కోట్లు  

మన దేశంలో బ్యాంకుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణాల్లో మొండి బకాయిలు రూ. 10.59 లక్షల కోట్లకు చేరుకున్నట్టు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మొండి బకాయిలు 9.3 శాతం నుంచి 11.2 శాతానికి పెరిగాయని వెల్లడించింది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఇది 4.1 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగాయని తెలిపింది. మొండి బకాయిల్లో ప్రభుత్వ బ్యాంకుల వాటా రూ. 8.95 లక్షల కోట్లు అని పేర్కొంది.

  • Loading...

More Telugu News