Andhra Pradesh: పూనం మాలకొండయ్య టార్చర్ తట్టుకోలేకే ఆ పోస్టులోకి ఎవ్వరూ రావడం లేదు!: జనసేన నేత రావెల

  • చంద్రబాబు శ్వేతపత్రాలతో మభ్యపెడుతున్నారు
  • ధనికులు, పట్టణాలకే వైద్యం పరిమితం
  • మెడికల్ పరిశ్రమలు కాగితాల్లోనే ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు చదువుతుంటే తనకు ఆశ్చర్యం కలుగుతోందని జనసేన నేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. చేయని పనులు చేసినట్లుగా, చేసిన తప్పులను సరైనవిగా చంద్రబాబు చూపిస్తున్నారని విమర్శించారు. ఏపీలో ప్రస్తుతం ధనికులు, పట్టణ ప్రాంతాల వారికే వైద్యం అందుబాటులో ఉంటోందని ఆరోపించారు.

శ్వేతపత్రాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య టార్చర్ తట్టుకోలేకే మెడికల్ డైరెక్టర్ పోస్ట్ లోకి ఎవ్వరూ రావడం లేదని రావెల ఆరోపించారు. మెక్ టెక్ జోన్ లో 10 సంస్థలు వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించినా, వాస్తవానికి అది కార్యరూపం దాల్చలేదనీ, కాగితాలకే పరిమితమయిందని విమర్శించారు.

More Telugu News