Rajamouli: రాజమౌళి, రమా రాజమౌళిలతో కలసి ఎన్టీఆర్, రాంచరణ్, రానా స్టెప్పులు.. వీడియో వైరల్

  • జైపూర్ లో రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం
  • ఓ స్టార్ హోటల్ లో రేపు పెళ్లి వేడుక
  • తరలి వెళ్లిన టాలీవుడ్ స్టార్లు

దర్శక దిగ్గజం రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజా ప్రసాద్ ల వివాహ వేడుక జైపూర్ లో రేపు జరగనుంది. జైపూర్ లోని కుకాస్ లోని ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు జైపూర్ చేరుకుని, సందడి చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళిలతో కలసి జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రానాలు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.

More Telugu News