Telangana: గీతం విశ్వవిద్యాలయానికి తెలంగాణ షాక్.. బీటెక్ డిగ్రీలు చెల్లవని ప్రకటన!

  • గీతం వర్సిటీ ఏఐసీటీఈ అనుమతి తీసుకోలేదు
  • సాంకేతిక కోర్సుల నిర్వహణకు వీల్లేదు
  • ఎంబీఏ విద్యార్థిని అడ్మిషన్ రద్దుచేసిన మండలి

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ డీమ్డ్ వర్సిటీ ‘గీతం’కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. గీతం విశ్వవిద్యాలయం అందించే బీటెక్ డిగ్రీలు చెల్లవని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. డిగ్రీలు అందించేందుకు గానూ గీతం విశ్వవిద్యాలయం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) నుంచి అనుమతి తీసుకోలేదని పేర్కొంది. అనుమతి లేకుండా సాంకేతిక కోర్సులను నిర్వహించే అర్హత గీతం సంస్థకు లేదని తేల్చిచెప్పింది.

ఈ సందర్భంగా గీతం నుంచి బీటెక్ డిగ్రీ పొంది ఇటీవల ఎంబీఏలో చేరిన ఓ యువతి అడ్మిషన్ ను రద్దుచేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంట్(గీతం)కు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ప్రాంగణాలు ఉన్నాయి. దీన్ని గీతం విశ్వవిద్యాలయం అని కూడా పిలుస్తారు. 1980లో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఈ విద్యా సంస్థ ఏర్పడింది. 2007లో యూజీసీ నిబంధనలు పాటించడంతో డీమ్డ్ హోదా పొందింది.

More Telugu News