vijay devarakonda: అవకాశం వస్తే కోడిపందేలను చూస్తా: విజయ్ దేవరకొండ

  • ఇంత వరకు కోడిపందేలను చూడలేదు
  • ఉభయగోదావరి జిల్లాలలో బాగా జరుగుతాయని విన్నా
  • అన్నవరం, కాకినాడ, రాజమండ్రిలు చాలా బాగున్నాయి
కోడిపందేలను తాను ఎన్నడూ చూడలేదని యంగ్ హీరో విజయ్ దేవరకొండ తెలిపాడు. ఉభయగోదావరి జిల్లాలలో కోడిపందేలు చాలా బాగా జరుగుతాయని విన్నానని... అవకాశం వస్తే చూడాలని ఉందని అన్నాడు. 'డియర్ కామ్రేడ్' చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గోదావరి జిల్లాల్లో షూటింగ్ ఆహ్లాదకరంగా కొనసాగిందని చెప్పాడు. తమ సినిమా దర్శకుడు కాకినాడకు చెందిన వ్యక్తి కావడంతో... చాలా వరకు ఇక్కడే షూట్ చేశారని తెలిపాడు. ఇక్కడి సముద్రం, ప్రకృతి అందాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని తెలిపాడు. అన్నవరం, కాకినాడ, రాజమండ్రిలు చాలా బాగున్నాయని చెప్పాడు.
vijay devarakonda
dear comrade
tollywood
kodi pandealu
cock fight

More Telugu News