Telangana: 'ఓటర్ కార్డ్' చిత్రాలు: ఓ మహిళను విజయ్ దేవరకొండగా మార్చేసిన వైనం!

  • కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో ఘటన
  • అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న విచిత్రం
  • ఓటు వేయలేక వెనుదిరిగిన మహిళ
సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఓట్లు ఓ ప్రాంతంలో గల్లంతయి, మరో ప్రాంతంలో ప్రత్యక్షమయితే, మరికొన్ని సార్లు అసలు పేర్లు, ఫొటోలే మారిపోతుంటాయి. ఇలాంటిదే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.

కొమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణం 14వ వార్డులో జి.సంగీత అనే మహిళ ఉంటోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమెకు ఇచ్చిన ఓటర్ స్లిప్పులో ఆమె ఫొటోకు బదులుగా హీరో విజయ్ దేవరకొండ ఫొటో ప్రత్యక్షమయింది. దీంతో ఆమె ఓటు వేసేందుకు వెళ్లగా అధికారులు అనుమతించలేదు. దీంతో సంగీత నిరాశగా వెనుదిరిగారు. 
Telangana
Telangana Assembly Election

More Telugu News