allu arjun: సాయిధరమ్ తేజ్ కోసం మనసు మార్చుకున్న బన్నీ!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ 
  • పరశురామ్ తో సాయిధరమ్ తేజ్
  • త్వరలోనే సెట్స్ పైకి    
అల్లు అర్జున్ కి ఒకటి రెండు పరాజయాలు ఎదురైనా ఆయన స్టార్ డమ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సాయిధరమ్ తేజ్ పరిస్థితి అలా కాదు. కొంతకాలంగా ఆయన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తన స్థానాన్ని కాపాడుకోవడానికి సతమతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే బన్నీ కోసం త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేస్తే, 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ మరో కథను రెడీ చేశాడు.

పరశురామ్ దర్శకత్వంలోను బన్నీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే హిట్ అనేది తనకంటే సాయిధరమ్ తేజ్ కి ఎక్కువ అవసరం అని భావించిన బన్నీ, ఆ సినిమాను సాయిధరమ్ తేజ్ తో చేయమని పరశురామ్ తో చెప్పాడట. ముందుగా అనుకున్నట్టే త్రివిక్రమ్ తో కలిసి బన్నీ సెట్స్ పైకి వెళతాడు. బన్నీ కోసం పరశురామ్ తయారు చేసుకున్న కథలో కథానాయకుడిగా తేజు కనిపిస్తాడు. ఈ సినిమా హిట్ కొడితే బన్నీ చేసిన త్యాగానికి ఫలితం లభించినట్టే. 
allu arjun
saidharam tej

More Telugu News