Chiranjeevi: కేటీఆర్, నేను బెంచ్ మేట్స్... తను అంత వినయ విధేయుడేమీ కాదు!: చిరంజీవి

  • ఇద్దరమూ అసెంబ్లీలో ఒకేసారి పనిచేశాం
  • డేరింగ్, డ్యాషింగ్ చూపించే కేటీఆర్
  • 'వినయ విధేయ రామ' వేడుకలో చిరంజీవి

"కేటీఆర్, నేను బెంచ్‌ మేట్స్‌... అదేంటది వయసులో తేడా ఉంది. ఆయన ఏ కాలేజ్ లో ఏ స్కూల్‌ లో అని అడగొద్దు. అసెంబ్లీలో... అసెంబ్లీలో మేమిద్దరం ఒకే టైమ్‌ లో శాసనసభ్యులుగా ఉన్నాం. ఆ టైమ్ లో నేను కేటీఆర్ ను అబ్జర్వ్ చేస్తూ ఉంటే, చాలా తక్కువగా మాట్లాడేవారు. ఎంతో వినయంగా, విధేయంగా మా దగ్గరకు వచ్చి మాట్లాడి, కుశల ప్రశ్నలు అడిగేసి వెళ్లిపోయి తన పని చూసుకునేవారు. చూస్తుంటే గనక చాలా వినయ విధేయ రామ ఎవరోకాదు. మన కేటీఆర్ గారే అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.

కానీ, నిజానికి ఆయన నేను అనుకున్నంత వినయ విధేయ రామ ఏమీ కాదు. మాటల తూటాలతోటి ప్రత్యర్థులను తికమకపెట్టి, నోరుమూయించేంతటి డైనమిజం ఉన్న వ్యక్తి. నన్ను బిగినింగ్ లో డేరింగ్, డ్యాషింగ్, డైనమిక్ హీరో అంటుండేవారు. ఆ మూడు పదాలూ కేటీఆర్ అనే మూడు అక్షరాలకు సరిగ్గా సరిపోతాయి. యస్... ఇది నిజం" అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా సాగగా, చిరంజీవి పాల్గొని, కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. దీనికి ప్రతిగా కేటీఆర్ నవ్వుతూ రెండు చేతులూ జోడించి నమస్కరించారు. 

More Telugu News