vinaya vidheya rama: ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ ను విడుదల చేసిన కేటీఆర్, చిరంజీవి

  • ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక
  • ముఖ్యఅతిథిగా హాజరైన టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్
  • కేటీఆర్ కు ఘనస్వాగతం పలికిన చిరంజీవి, రామ్ చరణ్
‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు కేటీఆర్ కు ఆహ్వానం పలికారు. హైదరాబాద్, యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, ఈ చిత్రం ట్రైలర్ ని కేటీఆర్, చిరంజీవి కలసి ఆవిష్కరించారు.

కాగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా ఎంతో మందికి బాట వేసి, వాళ్ల కెరీర్ సాగిపోయేలా చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని ప్రశంసించారు. ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలా కాకుండా విజయోత్సవ వేడుకలా ఉందని అన్నారు. ఎంతో మంది దిగ్గజాలు ఈ సినిమాకు పని చేశారని చెబుతూ, ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని కోరుకున్నారు. 
vinaya vidheya rama
trailer
KTR
Chiranjeevi
ramcharan
allu aravind
pre release function

More Telugu News