triple talaq: ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

  • వీగిపోయిన అసదుద్దీన్ ఒవైసీ సవరణలు
  • బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, అన్నాడీఎంకే వాకౌట్
  • ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 245 
  • వ్యతిరేకంగా 11 మంది ఓటింగ్

ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. నాలుగు గంటల చర్చ, ఆపై ప్రభుత్వ సమాధానం అనంతరం ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 245 మంది, వ్యతిరేకంగా11 మంది సభ్యులు ఓటు వేశారు. కాగా, ఈ బిల్లుకు సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును సంయుక్త సెలక్ట్ కమిటీకి నివేదించనందుకు నిరసనగా కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి.

కాగా, ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని ఈ ఏడాది సెప్టెంబర్ లో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను ఆరు నెలల్లోగా బిల్లు రూపంలో తీసుకురావాల్సిన క్రమంలో ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News