Chandrababu: చంద్రబాబు మొసలికన్నీరు కారిస్తే నమ్మేవారెవ్వరూ లేరు: వైఎస్ జగన్

  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడరే?
  • పోరాడే వారిపై కేసులు పెడతామన లేదా?
  • నాడు రాహుల్ పై, నేడు మోదీపై విమర్శలు చేస్తారా? 

ఇచ్చిన హామీలు నెరవేర్చని మోదీ ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు? మనం బతికామో, చచ్చామో చూసేందుకా మోదీ వస్తోంది? మనం కష్టాల్లో ఉంటే చూసి వెక్కిరించడానికి వస్తున్నారా? అని ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు నిన్న వ్యాఖ్యలు చేయడం విదితమే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. 2015లో మోదీని పక్కనబెట్టుకుని రాహుల్ ని.. 2018లో రాహుల్ ని దగ్గరపెట్టుకుని మోదీని చంద్రబాబు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిందిపోయి, దాని కోసం పోరాడే వారిపై కేసులు పెడతామన్న చంద్రబాబు ఇప్పుడు మొసలికన్నీరు కారిస్తే ఎవరూ నమ్మేవారు లేరని అన్నారు. 

  • Loading...

More Telugu News