rajani: తెలుగులో ఒకరోజు ముందే రానున్న 'పేట'

  • కార్తీక్ సుబ్బరాజు నుంచి 'పేట'
  • తెలుగులో జనవరి 10న విడుదల 
  • తమిళంలో జనవరి 11న రిలీజ్

రజనీ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'పేట'పై వుంది. కార్తీక్ సుబ్బరాజు ఎంచుకునే కాన్సెప్ట్ పై నమ్మకం .. రజనీ డిఫరెంట్ లుక్ .. నాయికలుగా సిమ్రాన్ - త్రిష ఎంపిక ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరగడానికి కారణమవుతున్నాయి. ఇక హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ సేతుపతి ఒక కీలకమైన రోల్ చేయడం ఈ సినిమాపై మరింత ఆత్రుతను పెంచుతోంది. తమిళంలో ఈ సినిమాను జనవరి 11వ తేదీన అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే .. అంటే జనవరి 10వ తేదీనే తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకి ఒకరోజు ముందు 'కథానాయకుడు' థియేటర్లకు వస్తుంది. 'పేట' మరుసటి రోజున 'వినయ విధేయక రామ' .. ఆ మరుసటి రోజున 'ఎఫ్ 2' థియేటర్లకు రానున్నాయి. రజనీ రంగంలోకి దిగడంతో సంక్రాంతి బరిలో పోటీ మరింత రసవత్తరంగా మారింది.

More Telugu News