loksabha: లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ.. విపక్షాల ఆందోళన!

  • బిల్లు పట్ల కేంద్రం తీరుపై విపక్షాల నిరసన
  • సభలో గందరగోళ పరిస్థితులు
  • చర్చకు సహకరించాలని కోరిన మంత్రి రవిశంకర్ ప్రసాద్
ట్రిపుల్ తలాక్ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, ఈ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు రక్షణ కలుగుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్ సభలో ఈరోజు వాడీవేడీ చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లు పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో బిల్లుపై చర్చకు సహకరించాలని సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు.

 ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బిల్లులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని, పలు దేశాలు ఈ ఆచారాన్ని రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, ట్రిపుల్ తలాక్ బిల్లుపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని, దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.  
loksabha
triple talaq
bjp
congress

More Telugu News