cuddapah: ఉత్తిత్తి స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి చంద్రబాబు మరో డ్రామా ఆడారు: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • రాయేగా పోయిందేముందని వేసేశారు
  • ‘చంద్రన్న రాళ్లు’ రాయలసీమలో చాలా వున్నాయి
  • బాబు పాలనలో పని తక్కువ.. మోసం ఎక్కువ

కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాలదిన్నెలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఈరోజు భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం పక్కనపెట్టేయడంతో దీని నిర్మాణానికి చంద్రబాబు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శలు చేశారు.

‘ఉత్తిత్తి స్టీల్ ప్లాంట్ కు శంకు స్థాపన చేసి చంద్రబాబు గారు మరొక డ్రామా ఆడారు. రాయేగా పోయిందేముందని వేసేశారు. ఇటువంటి అమలుకు నోచుకోని ‘చంద్రన్న రాళ్లు’ రాయలసీమలో చాలా వున్నాయి. అసలు గనుల వివరాలను అధ్యయనం చేయకుండా, పొందుపరచకుండా సీమ ప్రజలను మరొకసారి మోసం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో పని తక్కువ. మోసం, ఆర్భాటం ఎక్కువ. స్టీల్ ప్లాంట్ విషయంలో చెప్పేవన్నీ అబద్ధాలే. ఒక రాయి పడేసి రాయలసీమను ఉద్ధరిస్తున్నట్లు పెద్ద బిల్డ్ అప్ ఒకటి..’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News