Chittoor District: విద్యార్థులను నగ్నంగా నిలబెట్టిన 'చైతన్య భారతి'... గుర్తింపు రద్దు!

  • హోమ్ వర్క్ చేయకుండా వచ్చిన విద్యార్థులు
  • ఐదుగురిని స్కూలు బయట నిలబెట్టిన యాజమాన్యం
  • తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత
పాఠశాలకు హోమ్ వర్క్ చేయకుండా వచ్చారన్న కారణంతో కొందరు విద్యార్థులను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిందో విద్యాసంస్థ. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు చైతన్య భారతి స్కూలులో జరిగింది. ఐదుగురు విద్యార్థుల బట్టలను ఊడదీయించిన టీచర్లు, వారిని అందరూ చూసేలా స్కూలు బయట నిలబెట్టారు. ఘటనపై వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, విద్యాశాఖ స్పందించింది. నిన్న ఈ ఘటన జరుగగా, నేడు పాఠశాలను సందర్శించి విచారించిన అధికారులు చైతన్య భారతి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. పాఠశాలలోని విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ తెలిపింది.
Chittoor District
Chaitanya Bharati
School
Nude
Students

More Telugu News