rajani: సంక్రాంతినే ఖాయం చేసుకున్న రజనీ

  • రజనీకాంత్ నుంచి 'పెట్టా' 
  • గతంలో సంక్రాంతికి వచ్చిన 'బాషా' 
  • ఈ సారి తెలుగులో గట్టిపోటీ    

రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'పెట్టా' రూపొందింది. ఈ సినిమాలో రజనీ సరసన ఒక కథానాయికగా సిమ్రాన్ .. మరో కథానాయికగా త్రిష నటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను సి.కల్యాణ్ సొంతం చేసుకున్నారు.

సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండటంతో, 'పెట్టా'కి థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించారు. ఈ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కానీ సంక్రాంతికే ఈ సినిమాను బరిలోకి దింపాలనే నిర్మాత పట్టుదలతో ఆ దిశగా పనులు జరుగుతున్నాయట. గతంలో తెలుగులో సంక్రాంతికి వచ్చిన 'బాషా' తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ఈ సినిమాను రంగంలోకి దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. రజనీ ఆ స్థాయి విజయాన్ని నమోదు చేస్తాడేమో చూడాలి మరి.

More Telugu News