Hyderabad: హైదరాబాద్ పోలీసులకు చైన్ స్నాచర్ల సవాల్... 12 గంటల వ్యవధిలో 10 ఘటనలు!

  • రెచ్చిపోయిన దుండగులు
  • ఎల్బీ నగర్ పరిధిలో 7 దొంగతనాలు
  • హయత్ నగర్ లో రెండు చోట్ల చైన్ స్నాచింగ్
  • రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 12 గంటల వ్యవధిలో 10 ప్రాంతాల్లో మహిళల మెడల్లో ఉన్న బంగారు గొలుసులను లాక్కెళ్లి పోలీసులకు సవాల్ విసిరారు. ఒక్క ఎల్బీ నగర్ జోన్ లోనే ఏడు చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. హయత్ నగర్ పరిధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు దుండగులు. ఇక్కడి లెక్చరర్ కాలనీలో లక్ష్మమ్మ అనే మహిళ నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. కుంట్లూర్ రోడ్ లో నిర్మల అనే మహిళ నుంచి రెండున్నర తులాల గొలుసును దొంగిలించారు. చైన్ స్నాచింగ్ లపై వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. దుండగులను గుర్తించేందుకు ఘటనలు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
Hyderabad
Chain Snatching
LB Nagar
Police

More Telugu News