India: పుజారా అద్భుత సెంచరీ... భారీ స్కోరు దిశగా భారత్!

  • 82 పరుగుల వద్ద కోహ్లీ అవుట్
  • 106 పరుగులతో క్రీజులో పుజారా
  • భారత స్కోరు 3 వికెట్ల నష్టానికి 299
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. వన్ డౌన్ లో వచ్చిన చటేశ్వర్ పుజారా అద్భుత రీతిలో రాణించి సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా మరో ఎండ్ లో నిలకడగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, నేడు లంచ్ విరామం తరువాత స్టార్క్ బౌలింగ్ లో ఫించ్ కు క్యాచ్ ఇచ్చి 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ కు చేరాడు. కోహ్లీ నిష్క్రమణ తరువాత అజింక్య రహానే వచ్చి చేరగా, 106 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుమిన్స్ బౌలింగ్ లో పుజారా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత స్కోరు 3 వికెట్ల నష్టానికి 299 పరుగులు కాగా, రహానే 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతనికి తోడుగా రోహిత్ శర్మ వచ్చి చేరాడు.
India
Australia
Cricket
Virat Kohli
Cheteshwar Pujara

More Telugu News