Chandrababu: కడప ఉక్కు పరిశ్రమకు నేడు చంద్రబాబు శంకుస్థాపన

  • విభజన హామీలో ఉన్నా పట్టించుకోని కేంద్రం
  • చివరికి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయం
  • ఉదయం 11:12 గంటలకు శంకుస్థాపన

చంద్రబాబు ప్రభుత్వం నేడు మరో మైలు రాయిని చేరుకోబోతోంది. కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. పది వేల ఎకరాల్లో ఉక్కు పరిశ్రమను నిర్మించేందుకు పదేళ్ల క్రితమే అడుగులు పడినప్పటికీ వివిధ కారణాల వల్ల ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఇందుకు అవసరమైన లాంఛనాలను పూర్తిచేసిన ప్రభుత్వం నేడు శంకుస్థాపనకు సిద్ధమవుతోంది.

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని విభజన చట్టంలో పేర్కొన్నా కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే దీనిని నిర్మించాలని సంకల్పించింది. ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్’గా నామకరణం చేసిన ఈ కంపెనీ నిర్మాణానికి ఈ ఉదయం 11:12 గంటలకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 

More Telugu News