Sharukh Khan: నార్త్ లో నేనెవరో తెలియదు.. అయినా నా ఎంట్రీ సీన్‌కు ఈలలు వేస్తున్నారు!: 'కె.జి.ఎఫ్' హీరో యశ్

  • ‘జీరో’ వసూళ్లను అధిగమించిన ‘కేజీఎఫ్’
  • షారుఖ్ సినిమాకంటే బాగా ఆడాలని కాదు 
  • రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యశ్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘కె.జి.ఎఫ్’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం కన్నడతోపాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల అయింది. బాలీవుడ్‌లో ఈ సినిమా షారుఖ్ ఖాన్ నటించిన ‘జీరో’ సినిమా వసూళ్లను మించింది. ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుదలైనప్పటికీ ‘జీరో’ నాలుగు రోజుల్లో రూ.69 కోట్లు రాబడితే.. ‘కె.జి.ఎఫ్’ రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఈ సందర్భంగా యశ్ మీడియాతో మాట్లాడుతూ.. షారుఖ్ సినిమా కంటే తన సినిమా బాగా ఆడాలనేది తన ఉద్దేశం కాదని.. రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నానని తెలిపాడు. తమ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని యశ్ పేర్కొన్నాడు. నార్త్ ఇండియాలో తానెవరో కూడా తెలియదని కానీ.. తన ఎంట్రీ సీన్‌కు చప్పట్లు, ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశాడు.

Sharukh Khan
Yash
Zero movie
KGF
Prashanth Neel
Bollywood

More Telugu News