Narendra Modi: రాజ్‌నాథ్‌తో కేసీఆర్ భేటీ.. విభజన హామీలు నెరవేర్చాలని వినతిపత్రం

  • మోదీతో 40 నిమిషాల పాటు భేటీ 
  • హామీలను అమలు చేయాలని వినతి
  • కేసీఆర్‌తో ఎంపీ వినోద్, రాజీవ్ శర్మ

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. నేడు ప్రధాని మోదీని కలిసిన కేసీఆర్ 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని కోరారు. ప్రధానికి 16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కేసీఆర్ అందజేశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. విభజన హామీలు నెరవేర్చాలని వినతిపత్రం సమర్పించారు. కేసీఆర్‌ వెంట ఎంపీ వినోద్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఉన్నారు.

More Telugu News