Akhilesh Yadav: కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ను సమర్థించిన అఖిలేష్ యాదవ్
- వాగ్దానాలను అమలు చేయడంలో విఫలం
- బీజేపీ నిజ స్వరూపం బయటపడింది
- కేసీఆర్‌ను త్వరలోనే కలుస్తా
కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ప్రజలను మోసగించిన బీజేపీని ఓడించేందుకు ‘ఫెడరల్ ఫ్రంట్’ అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
బుధవారం అఖిలేష్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రయత్నాలను ఆయన సమర్థించారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్న కేసీఆర్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో కలుస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనలో వారి నిజ స్వరూపం ఏమిటో బయటపడిందని అఖిలేష్ విమర్శించారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ‘ఫెడరల్ ఫ్రంట్’తో కలిసిరావాలని కోరారు.