charan: ప్రీ రిలీజ్ వేడుకలో 'వినయ విధేయ రామ' ట్రైలర్ రిలీజ్!

  • రేపే ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • రాత్రి 9 గంటలకి ట్రైలర్ రిలీజ్ 
  • జనవరి 11న సినిమా రిలీజ్

చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' నిర్మితమైంది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమా షూటింగు ఈ రోజుతో పూర్తవుతుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ .. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

కేటీఆర్ .. చిరంజీవి ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక చరణ్ తో గల సాన్నిహిత్యం కారణంగా ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకి వస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ వేదికపై రాత్రి 9 గంటలకి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ను బోయపాటి శ్రీను కట్ చేసినట్టుగా తెలుస్తోంది. వివేక్ ఒబెరాయ్ .. ప్రశాంత్ .. స్నేహా కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News