F2: ఆకట్టుకుంటోన్న 'ఎఫ్ 2' సెకండ్ లిరికల్ సాంగ్

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2'
  • ఆకట్టుకుంటోన్న పాటలు 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన 'ఎఫ్ 2' సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ని చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. "స్వర్గమే నేలపై వాలినట్టు .. నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు .. గుండెలోన పూలవాన కురిసినట్టుగా .. ఎంతో ఫన్ .. ఎంతో ఫన్" అంటూ ఈ పాట కొనసాగుతోంది.

ఈ పాట మేకింగ్ వీడియోకి సంబంధించిన దృశ్యాలపై ఈ వీడియోను కట్ చేశారు. వెంకటేశ్ .. తమన్నాలకి సంబంధించిన వేడుకలో సరదాగా .. సందడిగా సాగే గ్రూప్ సాంగ్ లా ఈ పాట వస్తుందనే విషయం అర్థమవుతోంది. వెంకటేశ్ .. తమన్నాలు ఈ వీడియోలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ సాంగ్ ను అనిల్ రావిపూడి మంచి కలర్ ఫుల్ గా చిత్రీకరించినట్టు ఈ వీడియోను బట్టి తెలుస్తోంది. తొలిసారిగా మల్టీ స్టారర్ చేస్తోన్న అనిల్ రావిపూడి .. హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.

  • Loading...

More Telugu News