Australia: బాల్ ట్యాంపరింగ్ చేయాలని డేవిడ్ వార్నరే నాకు చెప్పాడు.. నేను ఆలోచించలేకపోయా!: ఆస్ట్రేలియా ఆటగాడు బాన్ క్రాఫ్ట్

  • ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటన
  • బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డ ఆస్ట్రేలియా జట్టు
  • స్మిత్, వార్నర్, బాన్ క్రాఫ్ట్ లపై వేటువేసిన బోర్డు

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్ పై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఏడాది పాటు నిషేధం విధించింది. ట్యాంపరింగ్ కు పాల్పడ్డ యువ ఆటగాడు బాన్ క్రాఫ్ట్ పై 9 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా తనపై నిషేధం మరో నాలుగు రోజుల్లో ముగిసిపోనున్న నేపథ్యంలో బాన్ క్రాఫ్ట్ మీడియాతో మాట్లాడాడు.

ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రోద్బలంతోనే తాను బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు బాన్ క్రాఫ్ట్ తెలిపాడు. ఈ నెల 30న ప్రారంభం కానున్న బిగ్ బాష్ లీగ్ లో తాను ఆడనున్నట్లు వెల్లడించాడు. బంతి ఆకారాన్ని మార్చాల్సిందిగా వార్నర్ తనకు చెప్పాడనీ, అయితే ఇది సరైనదా? కాదా? అన్న విషయాన్ని తాను ఆలోచించలేకపోయానని పేర్కొన్నాడు. ఈ పనితో జట్టుపై చాలా ప్రతికూల ప్రభావం పడిందన్నారు. అయితే క్రికెట్ కు దూరమైన సమయంలో తన దృక్పథం పూర్తిగా మారిపోయిందన్నాడు. 

More Telugu News