KCR: కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని బ్రీఫింగ్ కోసం కలుస్తున్నారా!: చంద్రబాబు సెటైర్లు

  • కేసీఆర్ ఫ్రంట్ అంటూ దేశమంతా తిరిగారు
  • మోదీని కలవడం వెనుక అర్థం ఏమిటి?
  • కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లను కేసీఆర్ కలుసుకున్నారు. ఇదిలా ఉంచితే, మరోపక్క, నేడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో కేసీఆర్ సమావేశంపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశమంతా తిరిగి ఇప్పుడు ప్రధానిని కలుస్తున్నారంటే అర్థం ఏంటి? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ, కేసీఆర్ చర్యలే వాళ్ల ఉద్దేశాలను బయటపెడుతున్నాయని విమర్శించారు. ఇప్పుడు ప్రధానిని కేసీఆర్ కలుస్తున్నది రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమా? లేక బ్రీఫింగ్ కోసమా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. 'కేసీఆర్ పైకి చెప్పేది ఒకటి, చేసేది మరొకట'ని వ్యాఖ్యానించారు. అమరావతిలోని ప్రజావేదికలో ఈరోజు వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News