abdul kalam: తెరపైకి అబ్దుల్ కలామ్ బయోపిక్

  • పెరుగుతోన్న బయోపిక్ ల జోరు
  • అబ్దుల్ కలామ్ గా అనిల్ కపూర్ 
  • ఇప్పటికే పూర్తయిన స్క్రిప్ట్ వర్క్   

అటు బాలీవుడ్లోను .. ఇటు టాలీవుడ్లోను బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఎన్టీఆర్ .. వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఇక కాంతారావు బయోపిక్ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అబ్దుల్ కలామ్ బయోపిక్ ను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలామ్ దేశం గర్వించదగిన సైంటిస్ట్ గా ఎలా ఎదిగారు? అనే విషయంపై ఈ బయోపిక్ ఆసక్తికరంగా కొనసాగుతుందని అంటున్నారు. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ కలసి ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు.

ఇక ఇందులో అబ్దుల్ కలామ్ గా అనిల్ కపూర్ కనిపించనున్నారని అంటున్నారు. తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News