రుణమాఫీకి సహకరించకుండా కేంద్రం మోకాలడ్డింది: వ్యవసాయంపై చంద్రబాబు శ్వేతపత్రం
- అయినా ఒకేసారి రూ.50 వేల రుణమాఫీ
- దేశంలో ఏపీ ప్రభుత్వం సాధించిన ఘనత ఇది
- కేంద్రం ఇవ్వాల్సిన రూ.16వేల కోట్లకు కోత విధించింది
62 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో 17 పూర్తయ్యాయని, మరో 6 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రి బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణమాఫీకి సహకరించాలని కేంద్రాన్ని ఎంత కోరినా కనికరించలేదన్నారు. పైగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన 16 వేల కోట్ల రూపాయల నిధులకు కోత విధించారని చెప్పారు.
అభివృద్ధికి వ్యవసాయమే ఊతమని, కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయంపై ఆధారపడి వున్న 65 శాతం ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలన్నారు. అందుకే తమ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందని తెలిపారు.