3rd Test.: మెల్ బోర్న్ టెస్ట్: ముగిసిన తొలిరోజు ఆట

  • భారత్ - ఆసీస్ జట్ల మధ్య మూడో టెస్ట్
  • ఆట ముగిసే సమయానికి 215/2
  • ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ (47), పుజారా (68)
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్ - ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన మయాంక్ అగర్వాల్ 76 పరుగులు చేసి అవుట్ కాగా, హనుమ విహారి 8 పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ (47), చటేశ్వర్ పుజారా (68) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మరో వైపు ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ ఒక్కడికే రెండు వికెట్లు దక్కాయి.
3rd Test.
Cricket
bcci
Australia
India
Virat Kohli

More Telugu News