Andhra Pradesh: మా పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒడిశా ముఖ్యమంత్రి గారు!: చంద్రబాబు

  • ఒడిశాతో స్నేహపూర్వక సంబంధాలు
  • చర్చల ద్వారా సమస్యల పరిష్కారం
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి
ఒడిశా రాష్ట్రంతో స్నేహపూర్వక సంబంధాల విషయంలో ఏపీ కీలక ముందడుగు వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతీయ స్థాయిలో టీడీపీ చేస్తున్న పోరాటానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మద్దతు ఇచ్చారనీ, అందుకు అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఒడిశాకు చెందిన 'బిజూ జనతాదళ్' పార్లమెంటు సభ్యుడు సౌమ్యా రంజన్ పట్నాయక్ తో దిగిన ఫొటోను ముఖ్యమంత్రి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య స్నేహపూరిత సంబంధాలకు ముందడుగు వేశాం. ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్‌ ద్వారా జాతీయ స్థాయిలో మేము చేస్తోన్న పోరాటానికి మద్దతిచ్చిన ఒడిషా ముఖ్యమంత్రి @Naveen_Odishaకు అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకుంటాం’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Odisha
Telugudesam
Chandrababu
naveen patnayak

More Telugu News