Andhra Pradesh: మోదీని ఆంధ్రాకు రాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు ఎవరు?: సోము వీర్రాజు ఫైర్

  • పోలవరం ఓ జాతీయ ప్రాజెక్టు
  • కేంద్రం రూ.6,700 కోట్లు ఇచ్చింది
  • చంద్రబాబు ఓ వ్యాపారస్తుడు
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.6,700 కోట్లు ఇచ్చిందని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. రూ.16,000 కోట్లుగా ఉన్న పోలవరం వ్యయాన్ని గత రెండేళ్లలో ఏకంగా రూ.52,000 కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. కేంద్రం భారీగా నిధులు ఇస్తున్నా ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిచేయడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా, పురోగతి చూపకుండా ఉంటే కొత్తగా నిధులను కేంద్రం ఎందుకు విడుదల చేస్తుందని ప్రశ్నించారు.

పోలవరం ఓ జాతీయ ప్రాజెక్టు అనీ, ఇది పీపీఏ పర్యవేక్షణలో సాగాలని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి అప్పనంగా అప్పగించడంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. అసలు చంద్రబాబు ఓ వ్యాపారస్తుడనీ, నేత కాదని దుయ్యబట్టారు. అసలు ప్రధాని నరేంద్ర మోదీని ఏపీలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు ఎవరని ఆయన ప్రశ్నించారు.
Andhra Pradesh
Narendra Modi
Chandrababu
BJP
somu veeraraju
polavaram criticise

More Telugu News